BJP: 2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
Cheetah Die: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లో వరసగా చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ఈ రోజు మరో మగ చిరుత మరణించింది. మూడు నెలల్లో కునోలో 7వ చిరుత మరణించింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో చిరుత మెడపై గాయాలు గమనించిన తర్వాత వైద్య బృందాన్ని అప్రమత్తం చేశారు.
Digvijaya Singh: కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. దీనిపై ఆయనపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరగింది. దళిత, వెనకబడిన తరగతులకు చెందిన ఇద్దరు యువకులను తప్పుడు ఆరోపణల్లో ఇరికించి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. తప్పుడు లైంగిక ఆరోపణ మోపి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మలం తినిపించి జుగుప్సాకరంగా వ్యవహరించారు.
The age of consent: మధ్యప్రదేశ్ హైకోర్టు మైనర్లు, వారి సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల సెక్స్ సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. చాలా క్రిమినల్ కేసుల్లో యుక్తవయసులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జ్ ధర్మాసన వ్యాఖ్యానించింది.
PM Modi: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, UCC)ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మంగళవారం పర్యటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో 5 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని బోపాల్ ఆర్కమలపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను భౌతికంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.