Pan Card Scam: ఆమె చనిపోయిన పదేళ్ల తరువాత ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. అది కూడా లక్షో.. రెండు లక్షలో కాదు ఏకంగా రూ.7.55 కోట్ల ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో ఓ కుటుంబానికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఆ కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ పేరిట రూ.7 కోట్ల ట్యాక్సీ నోటీసు వచ్చింది. అయితే.. ఆ టీచర్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఈ నోటీసులు రావడం గమనార్హం. 2013లో ఆ టీచర్ చనిపోగా.. 2017-18 ఏడాదికి గాను ఆమె పేరిట ఇంత పెద్ద మొత్తంలో పన్ను వసూలు నోటీసులు వచ్చాయి.
Read also: SIIMA 2023: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. ఏకంగా 11 నామినేషన్స్
ఉషా సోని మధ్యప్రదేశ్‌లోని పట్కేటా గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. జులై 26న ఆమె పేరిట రూ.7.55 కోట్ల ట్యాక్సీ వసూలుకు చెందిన ఆదేశాలు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుమారుడు పవన్ సోనీ.. మాట్లాడుతూ.. 2013 నవంబర్ 16న మా తల్లి చనిపోయిందని, న్యాచురల్ కాస్టింగ్ సంస్థ పేరుపై ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి ఈ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులో ఉందని తెలిపారు. కేసు నమోదు చేశామని.. వాళ్ల అమ్మ పాన్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని.. వాళ్లెవరో తమకు తెలియదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఒక్క కుటుంబమే కాదు. అనేక కుటుంబాలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాలైన బేతూల్ జిల్లాలో దాదాపుగా 44 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. దాదాపు రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు నోటీసులు వచ్చాయి. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు రూ.5 నుంచి 7 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల ఇతనిపై రూ.1.26కోట్ల పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి. తమిళనాడులోని కోర్టల్లమ్‌లో తన పేరుపై ఓ అకౌంట్ ఉంది. ఈ పేరును ఇదే మొదటిసారి వినడమని నితిన్ తెలిపారు. 2014-15 మధ్య తన పేరుపై అకౌంట్ ఓపెన్ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటనలపై బేతూల్ ఎస్పీ సిద్ధార్ద చౌదరి స్పందించారు… దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.