Truck Carrying Tomatoes Worth Rs 21 Lakhs Missing In Karnataka: ‘టమాటా’ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. దాదాపుగా రెండు నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. వచ్చే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక టమాటా ధరల పెరుగుదల రైతులకు కాసుల వర్షం కురిపిస్తుండగా.. దొంగతనాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రూ. 21 లక్షల విలువైన టమాటాల లారీ కనిపించకుండా పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటకలోని కోలార్‌లో ఉన్న ఎస్‌వీటీ ట్రేడర్స్ యజమాని వినయ్ రెడ్డి దుకాణం నుంచి 11 టన్నుల టమాటా లోడుతో ఓ లారీ రాజస్థాన్‌లోని జైపుర్‌కు గత గురువారం (జూలై 27) బయలుదేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ టోల్ గేట్ దాటినట్లు వినయ్ రెడ్డికి డ్రైవర్ కాల్ చేసి చెప్పాడు. మరో రెండు గంటల్లో గమ్య స్థానానికి చేరుతామని కూడా తెలిపారు.
ఎక్కడి వరకు వెళ్లారనే సమాచారం తెలుసుకునేందుకు ఆదివారం ఉదయం వినయ్ రెడ్డి.. లారీ డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. లారీ డ్రైవర్ నంబర్ అందుబాటులో లేదు. డ్రైవర్ నంబర్ సహా లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో యజమాని వినయ్ రెడ్డి వెంటనే కోలార్ పోలీస్ స్టేషన్ వెళ్లి సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ ప్రమాదానికి గురైందా?, లేదా డ్రైవర్ లోడుతో ఉదయించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Jio 3GB Recharge Plans: రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్స్.. ప్రతిరోజూ 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!
Also Read: IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో చివరి వన్డే.. కోహ్లీ ఔట్! ఓపెనర్‌గా రోహిత్