Goods Train Derailed: మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్, కరేలీ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, ఆ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. నర్సింగపూర్ జిల్లాలో శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పశ్చిమ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ వెల్లడించారు. పట్టాలు తప్పడంతో జబల్‌పూర్-ఇటార్సీ అప్‌లైన్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Also Read: Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించినట్లు అధికారి తెలిపారు. గూడ్స్ రైలు బ్రేక్ వ్యాన్ (చివరి వ్యాగన్) నర్సింగపూర్, కరేలీ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత రైళ్లను ఇటార్సీ నుంచి జబల్‌పూర్ వైపు మళ్లించామని, ఇప్పుడు అప్‌లైన్‌లో ట్రాఫిక్ పూర్తిగా పునరుద్ధరించబడిందని చెప్పారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఇటార్సీ ఒకటి.