Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్ లో దారుణం జరిగింది. రక్షాబంధన్ పండగ రోజునే అన్నాచెల్లెలుపై దాడి జరిగింది. ప్రేమికులని భావించి ముగ్గురు వ్యక్తులు వీరిని చితకబాదారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 31న జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధికార భారతీయ జనతా పార్టీ( బీజేపీ) నుంచి వలసలు మొదలయ్యాయి. రెండు రోజుల్లోనే ఇద్దరు సీనియర్ నేతలు పార్టీని వీడారు.
Success Story: మధ్యప్రదేశ్‌లో రైతులు ఆవాలు, గోధుమలు, పప్పులను మాత్రమే పండిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇది అలా కాదు. ఇక్కడ రైతులు ఆధునిక పద్ధతుల్లో నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉదయం ముగ్గురు మంత్రులను తన కేబినెట్ లో చేర్చుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధీకి కేబినెట్ లో చోటు కల్పించారు.
దేశంలో ఉత్తమ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రకటించింది. ఆయా నగరాల్లో జరుగుతున్న అభివృద్ధితోపాటు.. నగరంలో ఉన్న సౌకర్యాలు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని స్మార్ట్ సిటీల ఎంపికను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
అక్టోబర్ రెండో వారంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు బీజేపీ రాజకీయ సమీకరణాలపై కసరత్తు ప్రారంభించింది. అసంతృప్తులను శాంతింపజేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ, కుల సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యప్రదేశ్లోని సాత్నాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.
నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళిధర్ రావు అన్నారు. కేసీఆర్ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు.. కుమార స్వామినీ వదిలేశాడు.. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను కొట్టలేరు అని ఆయన పేర్కొన్నాడు.
018లో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చిన ఇద్దరు సహచరులపై బీజేపీ విశ్వాసం ఉంచింది. రాబోయే ఎన్నికలలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చింది. ఈ జాబితాలో ఎడల్ సింగ్ కంసనా మరియు ప్రీతమ్ సింగ్ లోధి పేర్లు ఉన్నాయి. అయితే అదే సమయంలో సింధియాతో కలిసి బీజేపీలోకి వచ్చిన రణ్వీర్ జాతవ్కు టికెట్ దక్కలేదు.