Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling Case: అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పి. నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. చంద్రబాబు, పి. నారాయణపై 2021లో నమోదైన క్రిమినల్ కేసును జూలై 15న ఏపీ హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. 2021 మార్చి 12న ఏపీ సీఐడీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి జీవోలు జారీ చేయడాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని క్రిమినల్ కుట్రగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక, అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికి సంబంధించిన ఈ తీర్పు ఇతర కేసులపై ప్రభావం చూపదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా కేసులను వాటి స్వంత మెరిట్స్ ఆధారంగా నిర్ణయించాలని పేర్కొంది. దీంతో ఇతర కేసుల్లోని అంశాలను ఈ తీర్పుతో ముడిపెట్టకూడదని ధర్మాసనం స్పష్టం చేసినట్లయింది.
Also Read
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
రాజకీయ పోరాటాలను కోర్టులో చేయొద్దు
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో న్యాయస్థానం అవసరమైన రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పోరాటాలను కోర్టుల వేదికగా చేయకూడదని వ్యాఖ్యానించారు. రైతుల హక్కులు, ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయని, అయితే రాజకీయ వివాదాలను న్యాయపరమైన పోరాటాలుగా మార్చడం సరికాదని సూచించారు.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!