Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
- చెదల సమస్య ఎక్కువగా ఉందా..?
- చెదల బెడదను తగ్గించుకోవాలంటే సరైన మెటీరియల్ ఎంపిక అవసరం..
- అల్యూమినియం క్యాబినెట్లు, పీవీసీ ఫోమ్ బోర్డ్..
- కంపోజిట్, ఇంజినీర్డ్ మెటీరియల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Termite-Proof Furniture: ఇంట్లో చెక్క ఫర్నిచర్, అల్మారాలు, కిచెన్ క్యాబినెట్లు, టీవీ యూనిట్లు ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు లేదా ఇంటీరియర్ చేయించేటప్పుడు వీటికి ప్రత్యేకంగా ఉండాలని ఆలోచిస్తారు. సాధారణంగా ఫర్నిచర్ తయారు చేయించే సమయంలో డిజైన్, రంగు, ధర వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అయితే వీటితో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అదే చెదలు. అవును మీరు చదివింది నిజమే..
చెదలు చెక్కను లోపలి నుంచి నెమ్మదిగా తినేస్తాయి. బయటకు ఫర్నిచర్ బాగానే కనిపించినప్పటికీ, లోపల మాత్రం పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చెదల సమస్య మరింత పెరుగుతుంది. సమస్య బయటకు కనిపించే సమయానికి చెక్కకు అప్పటికే భారీ నష్టం జరిగి ఉండొచ్చు. అందుకే కేవలం ఫర్నిచర్‌పై యాంటీ-టెర్మైట్ కోటింగ్ చేయించడం కంటే.. మొదటి నుంచే చెదలు, తేమ ప్రభావం తక్కువగా ఉండే మెటీరియల్‌ను ఎంచుకోవడం మంచిది. అల్మారాలు, కిచెన్ క్యాబినెట్లు, వార్డ్రోబ్లు, షూ క్యాబినెట్లు, టీవీ యూనిట్ల కోసం చెక్క బదులు ఈ మెటీరియల్స్ వాడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
అల్యూమినియం క్యాబినెట్లు:
చెదల సమస్య అసలు ఉండకూడదనుకునేవారికి అల్యూమినియం క్యాబినెట్లు బెస్ట్ ఛాయస్. చెక్కలో ఉండే సెల్యులోజ్ చెదలకు ఆహారంగా మారుతుంది. అయితే అల్యూమినియంలో సెల్యులోజ్ ఉండదు. అంతేకాకుండా చెక్క మాదిరిగా తేమను పీల్చుకోదు. అందువల్ల కిచెన్ క్యాబినెట్లకు అల్యూమినియం మంచి ఆప్షన్‌గా ఉంటుంది. వంటగదిలో రోజూ నీరు, ఆవిరి, తేమకు క్యాబినెట్లు గురవుతుంటాయి. కాబట్టి చెక్క క్యాబినెట్లతో పోలిస్తే అల్యూమినియం క్యాబినెట్లకు తేమ కారణంగా దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాదండోయ్.. అల్యూమినియం క్యాబినెట్లను శుభ్రం చేయడం సులభం. ఇవి తేలికగా ఉండటంతో పాటు మన్నికగా కూడా ఉంటాయి. స్టయిలిష్ ఇంటీరియర్‌కు సరిపోయేలా వివిధ డిజైన్లలో తయారు చేయించుకోవచ్చు కూడా. అయితే క్యాబినెట్ మన్నిక కేవలం మెటీరియల్‌పై మాత్రమే ఆధారపడదు. అల్యూమినియం నాణ్యత, ఫ్రేమ్, హింజీలు, ఫిట్టింగ్ వంటి అంశాలు కూడా భాగమే.
పీవీసీ ఫోమ్ బోర్డ్:
చెక్కలా కనిపించే ఫర్నిచర్ కావాలి.. అలాగే చెదల సమస్యను తగ్గించుకోవాలనుకుంటే పీవీసీ ఫోమ్ బోర్డ్ కూడా మరో ఆప్షన్ . ఇది చెక్కతో పోలిస్తే తేమ వల్ల తక్కువగా దెబ్బతింటుంది. వివిధ రంగులు, డిజైన్లు, ఫినిష్‌లలో అందుబాటులో ఉండటంతో ఇంటీరియర్‌కు అనుగుణంగా ఉంటుంది. పీవీసీ ఫోమ్ బోర్డ్‌పై హై-ప్రెజర్ లామినేట్ ఉపయోగిస్తే అదనపు రక్షణ లభించవచ్చు. దీంతో చెక్కను పోలిన ఫినిష్ కూడా పొందవచ్చు. కిచెన్ క్యాబినెట్లు, వార్డ్రోబ్లు, టీవీ యూనిట్లు, షూ క్యాబినెట్లకు ఈ మెటీరియల్‌ను ఉపయోగించవచ్చు. అయితే బోర్డు నాణ్యత, మందం, ఫిట్టింగ్, అంచుల సీలింగ్ వంటి అంశాలను కూడా తప్పకుండా పరిశీలించాలి.
ట్రీటెడ్ హార్డ్‌వుడ్:
మీకు సహజమైన చెక్క లుక్, ఫీల్ కావాలంటే ట్రీటెడ్ హార్డ్‌వుడ్ ను ఎంచుకోవచ్చు. కొన్ని రకాల చెక్కల్లో సహజంగా ఉండే నూనెలు, ఇతర లక్షణాలు కొన్ని కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. సగ్వాన్ లేదా టీక్, మహోగని, సీడర్ వంటి చెక్కలను సాధారణంగా మన్నికైన వాటిగా పరిగణిస్తారు. అయితే ఏ చెక్కలోనూ ఎప్పటికీ చెదలు పట్టవని భావించడం తప్పని చెప్పాలి. చెక్క నాణ్యత, తేమ స్థాయి, ప్రాసెసింగ్, ట్రీట్మెంట్ వంటి అంశాలు చెదల నిరోధకతపై ప్రభావం చూపుతాయి. అందుకే హార్డ్‌వుడ్ ఉపయోగించేటప్పుడు సరైన యాంటీ-టెర్మైట్ ట్రీట్మెంట్తో పాటు అంచుల సీలింగ్‌పై కూడా దృష్టి ఉంచుకోవాలి.
కంపోజిట్ మెటీరియల్స్:
ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్‌లో వివిధ రకాల కంపోజిట్, ఇంజినీర్డ్ మెటీరియల్స్ కూడా బాగా ఉపయోగిస్తున్నారు. వివిధ పదార్థాలను కలిపి తయారు చేసే ఈ బోర్డులు కొన్ని సందర్భాల్లో సాధారణ చెక్కతో పోలిస్తే తేమ, కీటకాల ప్రభావాన్ని తట్టుకునేలా ఉంటాయి. కంపోజిట్ బోర్డుల్లో చెక్కను పోలిన గ్రెయిన్, వివిధ రంగులు, ఫినిష్‌లు అందుబాటులో ఉండటంతో స్టైలిష్ ఇంటీరియర్‌కు సరిపోతాయి. తేమ ప్రభావాన్ని తగ్గించడం, ఉబ్బిపోయే ప్రమాదాన్ని తగ్గించడం, శుభ్రం చేయడం సులభంగా ఉండటం వంటి ప్రయోజనాలు ఉంటాయి.
కిచెన్ మాత్రమే కాదు..
చెదల సమస్య కేవలం కిచెన్ క్యాబినెట్లకే పరిమితం కాదు. ఇంట్లో చెక్క లేదా చెక్క ఆధారిత బోర్డులు ఉపయోగించిన ప్రతిచోటా తేమ, సీలింగ్, మెటీరియల్ నాణ్యతపై శ్రద్ధ వహించాలి. బట్టలతో పాటు తేమ కూడా అల్మారాలో చేరితే చెక్కకు నష్టం కలగవచ్చు. ఇంకా షూ క్యాబినెట్ లో తడిగా ఉన్న షూల నుంచి వచ్చే తేమ చెక్కను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఫర్నిచర్ తయారు చేయించేటప్పుడు కేవలం అందం, ధరను మాత్రమే కాకుండా మెటీరియల్ నాణ్యత, తేమ నిరోధకత, చెదల నిరోధకత, సీలింగ్, ఇన్స్టాలేషన్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!