మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు మెగా ఫ్యామిలీపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు వేసి విష్ణును గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు. నాకు రాగ, ద్వేషాలు లేవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం…
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మా’కు ఎన్నికయిన సభ్యులకు నా అభినందనలు. ఇది ఎంతో సంతోషదాయకమై సందర్భం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద…
యంగ్ హీరో మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే అక్టోబర్ 16 న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైందిముందుగా ఫిల్మ్ నగర్ గుడిలో పూజలు ముగించుకుని, కల్చరల్ సెంటర్ లో వేడుక జరుగుతున్న వేదిక దగ్గరకు బ్యాండ్ మేళాలతో వచ్చారు. Read Also : శిల్పాశెట్టి,…
ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా…
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా పూజా కార్యక్రమాలతో సేవించి, తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఓం నమో భవానీ… అమ్మ మా అమ్మ.. దుర్గమ్మను నాకు చిన్నప్పుడు చూపించి ఈవిడే నీ అమ్మరా అన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మేళతాళాలు కొని తెచ్చి అమ్మకి ఇచ్చే అవకాశం నాకు దక్కింది. మూల నక్షత్రం రోజు రావడం కుదరలేదు.…
‘మా’లో ఇంకా వేడి తగ్గలేదు. గత మూడు నెలల ముందు నుంచే ‘మా’ ఎన్నికల గురించి వస్తున్న వార్తలు హైలెట్ అవుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయి రాజీనామా బాట పట్టాడు. ఇక ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన పలువురు సభ్యుల బృందం సైతం రాజీనామాలు చేస్తాము. ‘మా’ మెంబర్స్ గా కొనసాగుతూ మంచు విష్ణు పనితీరును ప్రశ్నిస్తామని…
‘మా’ ఎన్నికల అధికారిగా గెలిచిన మంచు విష్ణు ఇప్పటికే పదవీ బాధ్యతలను చేపట్టారు. ‘మా’ అధ్యక్షుడిగా ఆయన మొదటి సంతకం ఆగిపోయిన పెన్షన్స్ ఫైల్ పై చేశారు. ఇక తనను గెలిపించిన వారికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపిన విష్ణు ఇప్పుడు స్వయంగా అందరీ ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని కలిసిన మంచు విష్ణు త్వరలోనే చిరంజీవిని కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటానని వెల్లడించారు. ఈరోజు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికలలో గెలిచి, అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోషన్ ను ఎన్నికల సమయంలో…
‘మా’ ఎన్నికలు, వాటి తదనంతర ఫలితాలు, కొత్త ప్యానెల్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఓడిపోయిన ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం మరియు ఇతరులు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య మంచు విష్ణు తన తండ్రితో కలిసి వెళ్ళి నందమూరి బాలకృష్ణను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘మా’ ఫలితాల తరువాత తొలిసారిగా బాలకృష్ణను కలిశారు మంచు తండ్రీకొడుకులు. ఎన్నికలకు ముందు బాలకృష్ణ మంచు విష్ణుకే తాను సపోర్ట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టుగానే మంచు…