‘మా’ ఎన్నికలు సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ‘మా’లో రచ్చ నెలకొంది. ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్(మా)కు నోటిఫికేషన్ విడుదలైందో అప్పటి నుంచే రచ్చ పీక్స్ కు చేరుకుంది. ఎన్నికల రిజల్ట్ వచ్చాక అందరూ కలిసిపోతారని భావించారు. అలాంటిదేమీ జరుగకపోగా ‘మా’లో చీలీకను కారణమవుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో అసలు ‘మా’లో ఎం జరుగుతోంది. ‘మా’ అసోసియేషన్ రెండు గ్రూపులుగా విడిపోయిందా? అన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది.…
అక్టోబర్ 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ మంచి మెజారిటీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయింది. ఈరోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసి, పెండింగ్ లో ఉన్న పెన్షన్స్ ఫైల్ పై సంతకం చేశాడు. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులందరూ నిన్న తమ పదవులకు రాజీనామా చేసారు. వారంతా ‘మా’లో సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు. అయితే తాము గెలిచినప్పటికీ తమ పదవులను…
పలు ఆసక్తికర పరిణామాల మధ్య ఎట్టకేలకు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పైగా బెనర్జీ వంటి నటులు పలు ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన సందర్భంగా మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ “కలిసి పనిచేస్తాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు. బయట ఉండి…
‘మా’లో ఎన్నికలు ముగిసినా యుద్ధవాతావరణంలో మార్పు లేదు. మా సభ్యులు మెజారిటీ మంచు విష్ణు ప్యానెల్ కి కట్టబెట్టినా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో కూడా కొంత మందిని గెలిపించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ని, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీని, జాయింట్ సెక్రెటరీగా ఉత్తేజ్ ని… అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 8 మందిని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిపించారు. అయితే వీరందరూ మంగళవారం తమను ఎన్నుకున్న మెంబర్లకు సారీ చెబుతూనే…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. పెండింగ్ పెన్షన్స్ ఫైల్ పైన మంచు విష్ణు అధ్యక్షుడిగా తొలి సంతకం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా…
అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన వారంతా “మా” పదవులకు రాజీనామా చేశారు. దీంతో మంచు విష్ణుకు రూట్ క్లియర్ అయినట్టుంది. రెండేళ్ల పాటు “మా”లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు. “మా” సభ్యుల మంచికోసమే ఈ రాజీనామాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించింది. ఈ రెండేళ్లలో విష్ణు చేసే పనులుకు అడ్డుగా ఉండకూడదనే ఈ రాజీనామాలన్నారు. మీడియాను పిలిచి ఈ విషయం స్వయంగా చెప్పారు ప్రకాష్ రాజ్. మూకుమ్మడి…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు ఎక్కడా అనిపించలేదని, మోహన్ బాబు గారే పోటీ చేశారనే భావన అందరికీ కలిగిందన్న అభిప్రాయాన్ని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన అభ్యర్థులు వ్యక్తం చేశారు. నిజానికి మోహన్ బాబు తమపై చేసిన దౌర్జన్యాన్ని విష్ణు, మనోజ్ ఆపే ప్రయత్నం చేశారని, ఒక వేళ అక్కడ మంచు మనోజ్ లేకపోయి, తమని వారించి ఉండకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేవని సమీర్ అన్నాడు. పాతికేళ్ళుగా…
నిజాలు తెలుసుకోకుండా నా పేరు వాడిన వారిపై కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చారు యాంకర్, నటి అనసూయ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవాళ్లు రాజీనామా ప్రకటన కోసం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.. ఆ కార్యక్రమానికి వచ్చిన అనసూయ.. అక్కడి నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో.. మా ఎన్నికలపై మీడియా ప్రశ్నించింది.. ఆ ప్రశ్నలపై కొంత అసహనం వ్యక్తం చేసిన ఆమె.. నన్ను మీరు ఘెరావ్ చేసినంత పనిచేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే,…
ఆదివారం ‘మా’కు జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి మొత్తం 11 మంది గెలిచారు. ఇందులో ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాగా, శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైప్ ప్రెసిడెంట్ గా, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా, ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా గెలిచిన బ్రహ్మాజీ, సుడిగాలి సుధీర్ తప్ప మిగిలిన గెలిచిన సభ్యులంతా రాజీనామా ప్రకటన సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఓటమి పాలైన జీవిత, హేమ తదితరులు కూడా హాజరయ్యారు.…
‘మా’కు జరిగిన ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఉత్తేజ్ తనను గెలిపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య పద్మ చనిపోయిన కారణంగా తాను ఎవరినీ ఓటు అడగలేదని, కానీ తన మీద ప్రేమతో మూడు వందల మంది ఓటు వేసి తనను జాయింట్ సెక్రటరీగా గెలిపించారని ఉత్తేజ్ అన్నాడు. బల్బ్ ను కనుగొన్న థామస్ ఆల్వ ఎడిసన్, సినిమాను ఇచ్చిన లూమియర్ బ్రదర్స్, ‘మాయాబజార్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మార్కస్ బాట్లే…