మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు మెగా ఫ్యామిలీపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు వేసి విష్ణును గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు. నాకు రాగ, ద్వేషాలు లేవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం నాకు చెడు చేసింది.
Read Also : మోహన్ బాబు కోపం ఆయనకే నష్టాన్ని కలిగించింది : తలసాని
విష్ణు భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ‘మా’కి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలి. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ని కలవాలి. నేను అభ్యర్థిస్తాను. మా సభ్యులకు సహాయం చేయమని అడుగుతాను. మా సభ్యులందరూ ఒక్కటే. విష్ణు ప్రామిస్ చేసినవన్నీ నెరవేరుస్తాడని భావిస్తున్నాను. కలసి మెలసి ఉందాం. కలసి కట్టుగా సాధిద్దాం. సమస్యలు ఉంటే అధ్యక్షుడి దృష్టికి తీసుకురండి. ఎన్నికలను ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించారు. ఇకనైనా మీడియాకు ఎక్కకండి. దయచేసి నన్ను రెచ్చకొట్టవద్దు. మనందరం ఒక్కటే’ అన్నారు మోహన్ బాబు.