యంగ్ హీరో మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే అక్టోబర్ 16 న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైందిముందుగా ఫిల్మ్ నగర్ గుడిలో పూజలు ముగించుకుని, కల్చరల్ సెంటర్ లో వేడుక జరుగుతున్న వేదిక దగ్గరకు బ్యాండ్ మేళాలతో వచ్చారు.
Read Also : శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై హీరోయిన్ ఫిర్యాదు… కేసు నమోదు
ట్రెజరరీగా ఎన్నికైన శివబాలాజీ భార్య మధుమిత ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేశారు. ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, డిఆర్సీ మోహన్ బాబు, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, మంచు విష్ణు, తదితరులతో పాటు మంచు ఫ్యామిలీ కూడా వచ్చారు. మంచు విష్ణు పిల్లలు, ఆయన భార్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పెద్దలంతా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ‘మా’కు జాతీయ గీతంగా భావించే ఎస్పీ బాలు ‘మా’ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం చేశారు. ఈ పాటను దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.