‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ‘మా’…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలు అనివార్యం అని చెప్పిన సభ్యులు, దానిని నిర్వహించే తేదీపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరపాలని…
ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని నటి హేమ ఆరోపించడంతో టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిధులను దుబారా చేస్తున్నారని, రూ. 5 కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. హేమ ఆరోపణలపై నరేశ్‌తో పాటు ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘మా’ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిందని క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడంతో హేమకు నోటీసులు జారీ అయ్యాయి. ఆమెను వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ…
మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈసారి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నటి హేమ…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జూలై 29వ తేదీ వర్చువల్ మోడ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను నిర్వహించింది. ఇందులో 2021-23కు జరగాల్సిన ఎన్నికలతో పాటు పలు అంశాలను చర్చించారు. ఆగస్ట్ 22న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని ఈసీ సమావేశం నిర్ణయించింది. అయితే ఎన్నికలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కానీ కొన్ని మీడియా సంస్థలలో ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్ 12న జరుగబోతున్నాయంటూ వార్తలు రావడాన్ని’మా’ కార్యవర్గం తప్పు పట్టింది. అలాంటి నిర్ణయం ఈసీ…
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నికల్లో స్పందించని నటీనటులు సైతం ఈసారి దూకుడు పెంచారు. అయితే.. తాజాగా ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోననని తెలిపారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు. తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ‘మా’కు శాశ్వత…
‘మా’ అధ్యక్ష పదవికి ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరభాషా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ‘మా’లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన పనెల్ సభ్యులను కూడా ప్రకటించారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా… ఎందుకు ఎలక్షన్స్ లో నిలబడ్డాడో వివరించారు ప్రకాష్ రాజ్. అలాగే మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్ కు ఉందని,…
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ ‘మా’ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలు మాత్రమే పోటీ పడేవి. కానీ ఈసారి మాత్రం సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. దీనితో ఈసారి పోటీ ఉత్కంఠభరితంగా మారింది.…