ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని నటి హేమ ఆరోపించడంతో టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిధులను దుబారా చేస్తున్నారని, రూ. 5 కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. హేమ ఆరోపణలపై నరేశ్‌తో పాటు ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘మా’ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిందని క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడంతో హేమకు నోటీసులు జారీ అయ్యాయి. ఆమెను వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ సంఘం కోరింది. కాగా, తాజాగా ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని డీఆర్‌సీ భావించింది. ఇది ఆమె మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిందని తెలుస్తోంది.