‘మా’ అధ్యక్ష పదవికి ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరభాషా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ‘మా’లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన పనెల్ సభ్యులను కూడా ప్రకటించారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా… ఎందుకు ఎలక్షన్స్ లో నిలబడ్డాడో వివరించారు ప్రకాష్ రాజ్. అలాగే మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్ కు ఉందని, లోకల్, నాన్ లోకల్ అనేది అర్థరహితమని, ‘మా’లో సభ్యత్వం ఉన్న ఎవ్వరైనా పోటీ చేయొచ్చని చెప్పుకొచ్చారు.
Read Also : ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఆశీస్సులు… నాగబాబు కామెంట్స్
ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ” ప్రకాష్ రాజ్ తన సేవా కార్యక్రమాల తో మహబూబ్ నగర్ జిల్లాకు మంచి పేరు తెచ్చారు. ప్రకాష్ రాజ్ మనస్తత్వాన్ని చూసి ఆయన వెనకాల వున్నాను. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఏమి లేదు. ఇక్కడ కులాలు, మతాలు లేవు అందరూ ఒక్కటే. ప్రభాస్ దేశాన్ని ఏలుతున్నాడు. రాజమౌళిని ఇంగ్లీష్ సినిమాలు తియ్యమని అడుగుతున్నారు. ఇక్కడ అందరూ గొప్పవారే వాళ్ళల్లో ప్రకాశ్ రాజ్ వెంటే నేను వుంటా. మా వెనుక పెద్ద వాళ్ల సహకారం కూడా వుంది. మీరు ఓట్లు వేయించకపోయిన పర్లేదు కానీ మమ్మల్ని గోల చేయొద్దు” అంటూ చెప్పుకొచ్చారు.