‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని క్రమశిక్షణ కమిటీకి లేఖలు కూడా వెళ్లాయి. కాగా, ఇటీవలే జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా కారణంగా కూడా ఈ ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి.