నటుడు మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ‘మా’ ఎన్నికల కోసం ఈరోజు మధ్యాహ్నం నామినేషన్లు వేయనున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మరియు ప్యానెల్ సభ్యులు, సివిఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ నామినేషన్లు వేయగా, నేడు మంచు విష్ణు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. మా అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పదవులకు త్రిముఖ పోటీ నెలకొంది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత, రఘుబాబు, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎన్నికలు హాట్ హాట్ గా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో మరో వివాదం మొదలైంది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న జీవిత, తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని చెబుతోందని.. ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవిత మా ఎన్నికల్లో…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు, అధ్యక్షా పదవి కోసం కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈసారి ఆ చర్చ మరింత వాడివేడిగా సాగుతోంది. ప్రకాష్ రాజ్ బృందం, మంచు విష్ణు బృందం ఎన్నికల్లో గెలిచేందుకు పోరాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ‘మా’ సభ్యులను ఆకర్షించడానికి తమదైన మార్గాలు అనుసరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాని ‘మా’ ఎలక్షన్స్ పై చేసిన కామెంట్స్ పై సినీ పెద్దలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు…
‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఈరోజు సమావేశయ్యారు. ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానించారు. దీంతో బండ్ల గణేశ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా భయంతో బ్రతుకుతున్న ఇటువంటి సమయంలో సినీకళాకారులందరిని విందు పేరుతో ఒక దగ్గర సమావేశపరచడాన్ని బండ్ల తప్పుబట్టారు. అయితే, బండ్ల గణేష్ వ్యాఖ్యలకు జీవితరాజశేఖర్ స్పందించారు. బండ్ల గణేష్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. జీవిత, హేమ పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరడంతో.. బండ్ల గణేష్ తన మద్దతు యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. జీవితపై తను పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తా.. అంటూ బండ్ల బయటకు వచ్చాడు. ఇదిలావుంటే, ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఊహించని పరిణామాలతో హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని బండ్ల గణేశ్ స్పష్టం చేయడమే కాకుండా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో జీవితా రాజశేఖర్ రాకను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తూ ప్యానల్ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకోవడంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్…
ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , జీవిత , హేమ , సీఐఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్ లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. పోటీలో అయిదుగురు కనిపిస్తున్న రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, సీనియర్ నటి హేమ మహిళా కార్డుతో పోటీకి సై అన్నారు. సీవిఎల్ నరసింహారావు…