రాజస్థాన్‌లోని కోటాలో ఓ ప్రేమ జంట నానా రచ్చ చేసింది. పోలీస్ జీపు ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు కౌగిలించుకుని.. ముద్దులు పెట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ పని చేయకుండా అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలను ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర దొంగల బండారం బయటపడింది. సహజీవనం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగ ప్రేమికులు. ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని చోరీలు చేస్తున్నారు కిలాడి కపుల్స్. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. Also…
పెళ్లి కాని యువతీ యువకులే కాదు.. పెళ్లైన వారు కూడా ప్రేమ పేరుతో కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. కొందరు అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింత పెరిగింది. ఫేస్ బుక్, ఇన్ స్టా పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇద్దరు వివాహితులు ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు…
ప్రేమ కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంటే.. మరికొందరు జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. ఇటీవల ప్రేమ కారణంగా యువతీ యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కలిసి బ్రతకలేమని తెలిసి కొందరు.. ప్రేమకు పెద్దలు అడ్డుచెప్తున్నారని మరికొందరు తనువులు చాలిస్తున్నారు. ప్రేమ కారణంగా అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలు గుజరాత్ లో.. ప్రియుడు హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. Also Read:Pawan Kalyan : పవన్ కల్యాణ్ తో గోపీచంద్ మలినేని సినిమా..?…
ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.. అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. భారత్‌లోనూ గతంలో జరిగినా.. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి (మం) బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం హరిత రిసార్ట్‌కు వచ్చిన ప్రేమజంట.. ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే.. రాత్రి పూట ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదు కానీ, ఉదయం రూమ్ క్లినింగ్‌కి సిబ్బంది వెళ్ళగా ప్రేమికులు ఉరివేసుకుని కనిపించారు.
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కారులో సజీవ దహనమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కథనం వెలువడింది. "పొలంలో వరి నాట్లు వేస్తుండగా.. కారులో మంటలు అంటుకోవడం కనిపించింది. పైపు లైన్ లేకపోవడంతో.. బిందెలతో నీళ్ళు పోసి ఆర్పే ప్రయత్నం చేశాం.
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మొదట తగలబడిన కార్‌ను చూసి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం అయ్యారు అని అనుకున్నారు.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కట్టుకున్నవారినే కాదని అడ్డదారులు తొక్కుతున్నారు. కలకలం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసి మధ్యలోనే పెడదారి పడుతున్నారు. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
Love Tragedy: తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రేమజంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలను అమ్మాయి తరపు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన పెంచలయ్య, త్రివేణిల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది.