Valentine’s Day: ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day) ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.. అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. భారత్‌లోనూ గతంలో జరిగినా.. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.. ఆ రోజు జంటలుగా రోడ్లపై కనపడినవారికి బలవంతంగా పెళ్లిళ్లు జరిపించిన సందర్భాలు కూడా లేకపోలేదు.. అయితే, రానురాను.. ప్రేమికుల దినోత్సవం స్వరూపాన్ని మార్చుకుంటుంది.. ప్రేమికుల రోజున.. ఓయో రూమ్స్‌కి మంచి వ్యాపారం పెరగడం.. ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో కండోమ్ అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయంటే.. ప్రేమికుల దినోత్సవం పేరుతో ఏం జరుగుతుందో.. ఇక, ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదేమే.. అయితే, ఆ చర్చ తర్వాత.. కానీ, అసలు ప్రేమికుల దినోత్సవం ఎలా పుట్టింది..? సెయింట్ వాలెంటైన్ ఎవరు? ఎవరి జ్ఞాపకార్థం ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు? అనే వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Read Also: Lalu Prasad Yadav: “మా బావకు కిడ్నాపర్లలో సంబంధం”.. లాలూ బావమరిది సంచలన ఆరోపణ..
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న, ప్రేమికుల వారం రోజ్ డేతో ప్రారంభమవుతుంది, దీనిని వాలెంటైన్స్ వీక్ అని పిలుస్తారు. ఈ క్రమంలో, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, చివరకు వాలెంటైన్స్ డేను ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. వీటన్నింటిలో, వాలెంటైన్స్ డే అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది, దీనిని చాలా దేశాలలో చాలా ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటారు. అయితే, వాలెంటైన్ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. సా.శ.పూ. 270లో రోమ్ దేశంలో జీవించిన వాలెంటైన్.. యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు.. ఇక,, అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వాలెంటైన్ అభిమానిగా మారిపోతుంది.. దీంతో, ఆ చక్రవర్తికి భయం పట్టుకుంది. యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో.. వాలెంటైన్‌కు మరణశిక్ష విధిస్తారు.. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. సెయింట్ వాలెంటైన్ ప్రేమ బోధకుడు, కాబట్టి ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడని కొందరి విశ్వసించారు. అందువల్ల, ఫిబ్రవరి 14ని ప్రేమికుల దినోత్సవంగా (వాలెంటైన్స్ డే) జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ రోజు నుండి, రోమ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.