ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మొదట తగలబడిన కార్‌ను చూసి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం అయ్యారు అని అనుకున్నారు. కానీ అంతలోపే ఊహించని ట్విస్ట్ నెలకొంది. కారులో సజీవ దాహనమైంది ఇద్దరు ప్రేమికులుగా గుర్తించారు. బీబీనగర్ మండలం జములపేటకి చెందిన పర్వతం శ్రీరామ్, ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన మైనర్ బాలికగా గుర్తించారు. శ్రీరామ్.. అతని స్నేహితుడు బొడుప్పల్ కి చెందిన వ్యక్తి వద్ద కార్‌ను తీసుకున్నారు.. ఎర్టిగా TS 08 JU 1163 కారులో ఉండి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. శ్రీరామ్ తాము సూసైడ్ చేసుకుంటున్నట్లు తండ్రి అంజయ్యకు కాల్ చేసి చెప్పాడు. సూసైడ్ లెటర్ కూడా లభ్యమైంది.
READ MORE: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన వెండి!
శ్రీరామ్ నారపల్లి లో హోల్ సేల్ సైకిల్ షాప్ నడుపుతున్నాడు.. బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బ్లాక్ మెయిల్ కారణంగానే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.. చింటూ అలియాస్ మహేష్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటూ సూసైడ్ నోట్‌లో ప్రేమికులు పేర్కొన్నారు. ప్రేమికులు ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి.. ఈ విషయం ఇంట్లో చెప్తానని బ్లాక్ మెయిల్ చేసినట్లు రాసుకొచ్చారు.. లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చింటూకి శ్రీరామ్ రూ. లక్షా 35 వేల రూపాయలు ఇచ్చాడు. ఇంకా డబ్బులు కావాలని చింటూ వేధించాడు. డబ్బు ఇచ్చేందుకు శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. కాగా.. మరోవైపు చింటూ అలియాస్ మహేష్ కీసర పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘట్కేసర్ పోలీసులు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.