ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కారులో సజీవ దహనమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కథనం వెలువడింది. “పొలంలో వరి నాట్లు వేస్తుండగా.. కారులో మంటలు అంటుకోవడం కనిపించింది. పైపు లైన్ లేకపోవడంతో.. బిందెలతో నీళ్ళు పోసి ఆర్పే ప్రయత్నం చేశాం. కొందరు వాహనదారులు వచ్చి చెట్ల కొమ్మలతో కొట్టి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.. అప్పటికే మంటలు పెద్దగా అయ్యాయి.. కారులో నుంచి ఒక యువకుడు మంటలతో పరిగెత్తుకొచ్చి రోడ్డు మీద పడ్డాడు.. కారులో ముందు సీట్ లో ఒక అమ్మాయి పూర్తిగా తగలబడింది. కళ్ళ ముందే బూడిద అయ్యింది.. మంటల ధాటికి దగ్గర వరకు కూడా వెళ్ళలేకపోయాం.” అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
READ MORE: Kadambari Jatwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..
ఇదిలా ఉండగా.. ఈ జంట ఆత్మహత్యకు గల కారణం చింటూ అనే వ్యక్తి అని తేలింది. చింటూ అలియాస్ మహేష్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటూ సూసైడ్ నోట్‌లో ప్రేమికులు పేర్కొన్నారు. ప్రేమికులు ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి.. ఈ విషయం ఇంట్లో చెప్తానని బ్లాక్ మెయిల్ చేసినట్లు రాసుకొచ్చారు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చింటూకి శ్రీరామ్ రూ. లక్షా 35 వేల రూపాయలు ఇచ్చాడు. ఇంకా డబ్బులు కావాలని చింటూ వేధించాడు. డబ్బు ఇచ్చేందుకు శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రేమికులు నిర్ణయించుకున్నారు.
READ MORE:Formula E Car Race Case : కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. దూకుడు పెంచిన ఏసీబీ