రాజస్థాన్‌లోని కోటాలో ఓ ప్రేమ జంట నానా రచ్చ చేసింది. పోలీస్ జీపు ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు కౌగిలించుకుని.. ముద్దులు పెట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: US: టారిఫ్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్-మార్కో రూబియో భేటీ
17 ఏళ్ల బాలిక, 22 ఏళ్ల యువకుడు ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. సెప్టెంబర్ 19న యువతి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు సమాచారం అందడంతో రాంపుర ప్రాంతంలో పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో ప్రేమికులిద్దరూ పోలీస్ జీపు ఎక్కి విచ్చలవిడిగా ప్రవర్తించారు. యువకుడు తాగిన మైకంలో ఉండడంతో యువతిని పదే పదే ముద్దు పెట్టుకుంటూ నానా రచ్చ చేశాడు. ఎట్టకేలకు జంటను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: ఈరోజు మళ్లీ జుబీన్ గార్గ్‌కు పోస్టుమార్టం.. అనంతరం అంత్యక్రియలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మాయి అదృశ్యమైందంటూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటా శివార్లలోని నాంటా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ బుక్కైంది. రాంపుర పోలీస్ స్టేషన్ అధికారులు పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టగా జంట కనిపించింది. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గందరగోళం సృష్టించారు. జంటను పోలీస్ వాహనంలోకి ఎక్కించబోతుండగా పైకప్పు పైకి వెళ్లి జంట నినాదాలు చేశారు. తమను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జంట చేసిన హంగామాను అక్కడే ఉన్న వారు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక జంటను రాంపుర కొత్వాలి స్టేషన్‌కు తరలించారు. యువకుడిపై బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆందోళన కలిగించడం, మైనర్‌తో పారిపోవడం వంటి కేసులు నమోదు చేశారు.
High-voltage drama on the streets of Kota at midnight. The lover crafted such a story that left even the police stunned. The lover and his beloved climbed onto a police vehicle, causing chaos all around. pic.twitter.com/5DkEFyfuKF
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 22, 2025