Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఓటు వేసే ముందు బురఖా ధరించిన మహిళలను గుర్తించాలని ఆయన కోరారు.
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లోని ఖరేవాన్ సరయ్మీర్‌లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అజయ్‌కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్‌పై ఇంక్ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
సార్వత్రిక ఎన్నికల ఐదవ దశలో భాగంగా.. సోమవారం 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అన్నీ చోట్ల ఎలాంటి ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. ఓ యువ ఓటర్.. ఎనిమిది సార్లు ఓటు వేశాడు. అంతేకాకుండా.. తాను ఓటేసే వీడియోను రికార్డు చేశాడు. అయితే.. ఈ వీడియో బయటకు రావడతో సోషల్ మీడియాలో…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగింది. అయితే.. ఉత్తర ప్రదేశ్ లోని రెండు గ్రామాలు, జార్ఖండ్‌లో ఒక గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీనికి కారణమేంటని ఆరా తీయగా.. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదని.. అందుకే తాము ఓటు వేయడం లేదని తెలుపుతున్నారు. తమ గ్రామ అభివృద్ధి గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం…
దేశంలో రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యధికంగా ఓటింగ్ జరుగుతోంది. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, లడఖ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ గెల్చుకుంటుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుస్తుందని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీంమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అన్నారు. నిన్న తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పువ్వు గుర్తుకు ఓటెయ్యమని చెప్పడం నిదర్శనం…
ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బులు చూపి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో…