పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ గెల్చుకుంటుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుస్తుందని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీంమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అన్నారు. నిన్న తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పువ్వు గుర్తుకు ఓటెయ్యమని చెప్పడం నిదర్శనం అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Read Also: Jagga Reddy: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై ఫైర్ అయిన జగ్గారెడ్డి
కేసీఆర్ కూతురు కవితను జైలు నుంచి బెయిల్ పై బయటకు తీసుకురావడానికి కేసీఆర్ బీజేపీతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నాడని షబ్బీర్ అలీ ఆరోపించారు. నిన్నటి వరకు దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రధానమంత్రి అవుతారని చెప్పిన కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీకి అమ్మిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని దుయ్యబట్టారు. ఐదు నెలలలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని అన్నారు. బీజేపీ పార్టీకి అమ్ముడుపోయిన పార్టీ బీఆర్ఎస్ అని తీవ్ర విమర్శలు చేశారు. మతతత్వ పార్టీతో కలిసిన బీఆర్ఎస్ పార్టీకి.. సెక్యులరిజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.
Read Also: Raai Laxmi: అబ్బా.. రత్తాలు కొత్త లుక్ అదిరిపోయింది..