ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లోని ఖరేవాన్ సరయ్మీర్‌లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
Valley of Flowers: ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా?.. ప్లాన్ చేసుకోండి..
ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలోని 543 సీట్లలో దేశంలోని 140 కోట్ల మంది బీజేపీకి 143 సీట్లు కూడా ఇవ్వరని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉండి.. టీకా వేసేందుకు కూడా దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. నేడు ఆ వ్యాక్సిన్ ముప్పును కలిగిస్తుందని.. టీకాలు వేసుకోవడానికి బీజేపీకి ఓటేస్తారా? అని ప్రశ్నించారు.
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అరెస్ట్..
బాబా సాహెబ్ రాజ్యాంగం కంటే బీజేపీ నేతలు పెద్దవారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో రైతులు యూరియా కొనుగోలుకు వస్తే నానో యూరియా ఇస్తున్నారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రతి పేపర్ లీక్ అయిందని యువతకు తెలుసు.. ఈ క్రమంలో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. యువత చాలా ప్రిపరేషన్‌తో వెళ్లారని.. తీరా పరీక్ష రాయడానికి వెళ్లగా పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే రేషన్ పరిమాణం పెంచుతామని అఖిలేష్ యాదవ్ అన్నారు. జూన్ 4 తర్వాత కేబినెట్ ఏర్పాటు చేస్తామని.. జూన్ 4 తర్వాత మీడియా సర్కిల్ కూడా మారిపోతుందని పేర్కొన్నారు. తమకు సంతోషకరమైన రోజులు వస్తాయని. మే 25న అజంగఢ్ చరిత్ర మారిపోతుందని తెలిపారు.