ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అజయ్‌కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్‌పై ఇంక్ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
Alcohol Withdrawal: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమౌతుందో తెలుసా?
ఈ దాడికి పాల్పడింది బీజేపీనేనని కన్హయ్య కుమార్ ఆరోపిస్తూ, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. కన్హయ్యపై దాడి జరిగినప్పుడు స్థానిక కౌన్సిలర్ ఛాయా శర్మ కూడా ఆయన వెంటే ఉన్నారు. పార్టీ తనను అభ్యర్థిని చేసినప్పటి నుంచి మనోజ్ తివారీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కన్హయ్య పేర్కొన్నారు. తమ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించడం లేదన్న భావన తివారీకి మొదలై.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడని కన్హయ్య కుమార్ తెలిపారు. తమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. సిట్టింగ్ ఎంపీ తివారీ తనకు పెరుగుతున్న ప్రజాదరణతో నిరాశ చెందారని, అందుకే తనపై దాడికి గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా హింసకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.
Jaya Jaya He Telangana: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆస్కార్ గ్రహీత సంగీతం!
కాగా.. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి మనోజ్ తివారీని అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సీటుపై వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. కన్హయ్య తన రాజకీయాలను JNU నుండి ప్రారంభించాగా.. మనోజ్ తివారీ ప్రసిద్ధ నటుడు, గాయకుడు.. ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి ప్రవేశించారు.