Loksabha Elections 2024 : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పోరు మొదలైంది. ఈసారి బీజేపీ, ఇండియా కూటమి ఏదీ మెజారిటీ మార్కును దాటలేకపోయింది.
2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విజయం సాధించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వినూత్నంగా.. నానా పటోలేను లడ్డూలతో తూకం వేశారు కార్యకర్తలు. రాష్ట్రంలో ఇండియా కూటమి అద్భుతమైన పనితీరును సంబరాలు చేసుకుంటున్నారు. కాంటాకు బంతిపూలతో చక్కగా అలంకరించి.. అందులో ఒక పక్కకు నానా పటోల్ ను కూర్చోబెట్టారు. మరో పక్కకు లడ్డూలను పెట్టి తూకం వేశారు. ఇందుకోసం మొత్తం 96 కిలోల లడ్డూలను వినియోగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై ఆయన విజయం సాధించారు. కానీ ఈసారి గెలుపు మెజారిటీ గణనీయంగా తగ్గిపోయింది. అతను తన సమీప ప్రత్యర్థి అజయ్ రాయ్‌పై 152,513 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మోదీకి 612,970 ఓట్లు రాగా, అజయ్ రాయ్‌కు 4,60,457 ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అథర్ జమాల్ లారీకి 33,766 ఓట్లు వచ్చాయి.…
శనివారం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చివరి దశ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అందులో అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వివిధ టీవీ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తోందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.
పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి…
లోక్సభ ఎన్నికల్లో భాగంగా.. గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు ఓల్డ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ (బాలికలు) బూత్ నంబర్ 223లో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకుని తన ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన తన బూత్‌లో తొలి ఓటు వేశారు. అంతకు ముందు.. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2023 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన బూత్‌లో మొదటి…
ఎగ్జిట్ పోల్స్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126 ఏ (1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
గత 35 ఏళ్ల తర్వాత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 58.46 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ ప్యానెల్ పేర్కొంది. 2019తో పోల్చితే కశ్మీర్ లోయలో 30 శాతం భారీగా పెరిగిందని తెలిపింది. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలంగా ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్…
ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు.
MS Dhoni Cast His Vote in Ranchi Today: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంచీలోని పోలింగ్ స్టేషన్‌లో ధోనీ ఓటేశారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వచ్చిన మహీని చూసేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. అయితే అక్కడున్న కొందరు ఆయనను పోలింగ్ స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. ఓటేసిన అనంతరం మహీ కారులో వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్…