సార్వత్రిక ఎన్నికల ఐదవ దశలో భాగంగా.. సోమవారం 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అన్నీ చోట్ల ఎలాంటి ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. ఓ యువ ఓటర్.. ఎనిమిది సార్లు ఓటు వేశాడు. అంతేకాకుండా.. తాను ఓటేసే వీడియోను రికార్డు చేశాడు. అయితే.. ఈ వీడియో బయటకు రావడతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో యువకుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎంల)లో ఓటు వేస్తున్నాడు. ఓటు వేస్తుండగా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. కాగా.. ఇది నాలుగో దశ పోలింగ్ లో జరిగింది. మే 13న యూపీలోని ఫరూఖాబాద్ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్ పేరు పక్కన ఉన్న బటన్‌పై నొక్కాడు. కొద్దిసేపటి తర్వాత.. యువకుడు మళ్లీ క్యూబికల్‌లో ఉన్నాడు, అంతేకాకుండా కెమెరాలో చూపిస్తూ “ఇది నంబర్ 2” అని చెప్పాడు. మరో రౌండ్ ఓటింగ్ తర్వాత, “ఇది మూడోది” అని చెప్పాడు.
AI for Google Search: ఇక గూగుల్ సెర్చ్ లో కుడా ఏఐ.. ఈ 8 ఫీచర్లు అస్సలు మిస్ కావద్దు!
ఈ విధంగా యువకుడు ఎనిమిది సార్లు ఓటు వేయడం వీడియోలో రికార్డ్ చేశాడు. అయితే.. అతను చూపిస్తున్న వీడియోలో ఒక్కోదానిలో ఒక చొక్కాలో కనిపించాడు. కొన్ని నివేదికల ప్రకారం, వీడియోలో ఉన్న యువకుడు.. ఏడుసార్లు పోల్ అధికారుల పరిశీలనను ఎలా దాటవేశారనేది స్పష్టంగా తెలియలేదు. కాగా.. ఈ ఘటనలో యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. ఆ పోలింగ్ బూత్ లో ఉన్న పోలింగ్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తామని, పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్‌కు సిఫార్సు చేశామని యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా తెలిపారు. కాగా.. ఎనిమిది సార్లు ఓటు వేసినట్లు యువకుడు అంగీకరించాడని సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ సింగ్ కుష్వాహా వార్తా సంస్థ AFPకి తెలిపారు.
మరోవైపు.. ఈ వైరల్ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. “ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒత్తిడి చేసి ప్రజాస్వామ్యాన్ని దోచుకోవాలని చూస్తోంది” అని ఆరోపించారు. మరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఎక్స్‌లో వీడియోను షేర్ చేశారు. “ఎలక్షన్ కమిషన్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి. లేదంటే, బీజేపీ బూత్ కమిటీ లూట్ కమిటీ” అనే పోస్ట్ చేశారు.
अपनी हार सामने देख कर भाजपा जनादेश को झुठलाने के लिए सरकारी तंत्र पर दबाव बना कर लोकतंत्र को लूटना चाहती है।
कांग्रेस चुनावी ड्यूटी कर रहे सभी अधिकारियों से यह अपेक्षा करती है कि वो सत्ता के दबाव के सामने अपनी संवैधानिक ज़िम्मेदारी न भूलें।
वरना INDIA की सरकार बनते ही ऐसी… https://t.co/fk4wXL8QZy
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2024