PM Modi: బడ్జెట్‌పై ప్రధాని మోడీ ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్‌కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకూడదు.. మేము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు మోడీ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాని పేర్కొన్నారు. బడ్జెట్‌తో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని.. ప్రజల ఆశీస్సులతో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశం ముందుకు సాగుతోందని.. అలాగే దేశ పురోగతి కొత్త శిఖరాలను తాకబోతుందని విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసినట్లు మోడీ గుర్తుచేశారు. బీజేపీ హయాంలో నారీమణులు అనేకమైన మేలు పొందారని తెలిపారు. కొత్త భవనంలో జరిగిన పార్లమెంట్ మొదటి సెషన్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందన్నారు. అలాగే పార్లమెంట్ కొత్త భవనంలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించడం.. గురువారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, అలాగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీలో జరిగిన కర్తవ్యపథ్‌లో మహిళలు కవాతు నిర్వహించడం ఇదంతా మహిళా శక్తి పండుగగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇలా ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ ప్రయాణం నిరంతరం ఇలానే కొనసాగుతుందని మోడీ స్పష్టం చేశారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
ఇది కూడా చదవండి: Union Budget: తాయిలాలతో హ్యాట్రిక్ కొట్టనున్నారా?
ఇదిలా ఉంటే గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలకు తాయిలాలు ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూడా అదే మాదిరిగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!