Budget2024: మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్ చేరుకోని.. అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు.. అక్కడ 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి బడ్జెట్ సమర్పణకు పర్మిసన్ తీసుకుంటారు.. ఆ తర్వాత 10 గంటలకు పార్లమెంటుకు తిరిగి రానున్నారు. ఇక, బడ్జెట్ సమర్పణకు ముందు 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రి వర్గం సమావేశం అవుతుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
Read Also: Dowleswaram Cotton Barrage: నేటి నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మూసివేత
ఇక, ఈ సమావేశం తర్వాత ఉదయం 11.05 గంటలకు నిర్మలా సీతారామన్ లోకసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. వరుసగా ఆరో సారి ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఎలాంటి హామీలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్నికలతో పాటు రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
Read Also: Mayank Agarwal: నేను బాగానే ఉన్నా.. పునరాగమనానికి సిద్ధమవుతున్నా: మయాంక్ అగర్వాల్
అయితే, నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును సమం చేయనుంది. 2019 జూలై నుంచి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టింది. ఇవాళ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌తో ఆమె వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించబోతుంది.