తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా, లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని చూస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. త్వరలో లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు.. నా అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన ట్వీట్లో రాసుకొచ్చారు.
అధికార కూటమిలో బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. అంటే 25 కంటే ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. దీని కోసం శివసేన (షిండే) యొక్క కొన్ని స్థానాలపై బీజేపీ కన్నేసింది.
Parliament: పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పరంపరం కొనసాగుతోంది. ఈ రోజు మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్, డీకే సురేష్‌లపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
Election Commissioners Bill: అత్యంత వివాదాస్పద చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నిమాయకానికి సంబంధించిన(నియామకం, సర్వీస్ రూల్స్, పదవీకాలం) బిల్లు-2023కి గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఈ నెల ప్రారంభంలోనే రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో, పార్లమెంట్ ఆమోదించినట్లైంది. భారత ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివాధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం మూజువాణి ఓటింగ్ చేపట్టి ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. . పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై నిరసనల నేపథ్యంలో 143 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ మధ్య ఈ చట్టాలు ఆమోదించబడ్డాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ..…
Parliament Attack : దేశ పార్లమెంటులో బుధవారం భద్రతా లోపం బట్టబయలైంది. ఇది మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నలుగురు కలిసి పార్లమెంటు పై పొగదాడి చేశారు.