అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠత (Ayodhya Ram Temple) చరిత్రలో నిలిచిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో (Lok Sabha) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. రామమందిరం ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ 11 రోజుల నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రశంసలు కురిపించారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కొత్త భారత యాత్ర ప్రారంభానికి ప్రతీక అని అమిత్ షా పేర్కొన్నారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమని చెప్పుకొచ్చారు. రాముడు లేని దేశాన్ని ఊహించుకునే వారికి మన దేశం గురించి బాగా తెలియదన్నారు. చరిత్ర తెలియని వారు ఓడిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో జనవరి 22 చారిత్రాత్మకమైన రోజుగా ఉండేపోతుందని.. ఇది రామభక్తులందరి ఆశలు.. ఆకాంక్షలను నెరవేర్చిన రోజు అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే రామమందిరంపై లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగే చర్చలో పాల్గొనబోమని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.
శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. ఏ చర్చ జరిగినా రాజకీయాలకు అతీతంగా రామాలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు.