ఇవాళ వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సీఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో 81 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 18 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేశాము అని తెలిపారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చారు. నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరిచి వారిని ఒక్కతాటి పైకి తీసుకు వచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలి అని ఆయన పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలి అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
Read Also: Ravi Shankar Rathod: గుప్పెడంత మనసు మను.. హనుమాన్ సినిమాలో నటించాడని తెలుసా.. ?
పార్టీ లక్ష్యం సాధించే దిశలో కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకోవాలి అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రీజినల్ కో- ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలి అని చెప్పాలి. బస్సు యాత్ర ప్రారంభమవుతున్నందున దీనికి అన్ని రకాలుగా సిద్ధం కావాలి అని పేర్కొన్నారు. అలాగే, తాను కూడా ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజల్లోనే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే మేం సిద్ధం పేరుతో ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను చేపట్టబోతున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి పార్లమెంట్‌లో ఒక బహిరంగ సభతో పాటు బస్సు యాత్రతో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా కార్యాచరణ సిద్దం చేశామన్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో మేం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుందన్నారు.