Lok Sabha Elections 2024, Telangana, Andhra Pradesh, AP Elections 2024, Nominations In Telugu States LIVE UPDATES, Nominations, AP Assembly Polls, Lok Sabha Polls
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
Election Commission: దేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే రికార్డు స్థాయిలో ఇంత మొత్తం నగదును ఇదే తొలిసారని ఎన్నికల సంఘం చెబుతోంది.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు ఇందుకు సిద్ధమయ్యాయి. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. యూట్యూబ్ గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ప్లాట్‌ఫారమ్ నుండి 2.25 మిలియన్ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.
దేశంలో మొదటి, రెండో దశ సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే దేశంలోని రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల అభ్యర్థిత్వంపై కొన్ని ముఖ్యమైన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 92 మంది సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను పార్టీ రద్దు చేసింది.
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ సార్వత్రిక ఎన్నికలలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 252 మంది అభ్యర్థులు నేరచరితులు అంటే వారిపై క్రిమినల్ కేసు నమోదైంది.
కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై అస్సాం ముఖ్యంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ది ఈస్ట్రన్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. నాగాలాండ్‌లోని ఆరు జిల్లాలతో కూడిన ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.