కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు నాంది కావచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ముంబైలో రెండు రోజుల ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న తర్వాత పాట్నా విమానాశ్రయంలో దిగిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ 18 మరియు 22 మధ్య ప్రభుత్వం పిలిచిన ప్రత్యేక సమావేశాలపై స్పందించారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈరోజు ప్రకటించారు.
Mamata Banerjee: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరుగుతాయని.. బీజేపీ ప్రభుత్వం మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జూలై 8న పశ్చిమ బెంగాల్ లో జరగే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. జల్‌పైగురి జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ..
శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ సోమవారం అన్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దింపాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం విపక్ష పార్టీలన్ని ఐక్యంగా పోరాడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ నేతలు కలిసి చర్చించారు.