Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలను కోరారు. "నేటి దశలో ఓటు వేసే వారందరినీ రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను మరింత చైతన్యవంతం చేస్తుంది" అని ప్రధాని మోడీ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కంగనాను బీజేపీ పోటీకి దింపింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా రనౌత్ సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. ఈ దశలో, 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు నమోదు చేయనున్నారు. ఈ దశలో 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. వారిలో 120 మంది మహిళలు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
Bengaluru: బెంగళూర్ నగర ఓటర్లు బద్ధకించారు. శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికల ప్రక్రియలో నగర ఓటర్లు అనాసక్తి ప్రదర్శించారు. సగం మంది బెంగళూర్ ఓటర్లు వేటేయడానికి రాలేదు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు ఎక్కడనుంచి పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ సాగింది.
Google Doodle: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల పండగ ఈ రోజు ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 97 కోట్ల ఓటర్లను కలిగిన అతిపెద్ద ఎన్నికలుగా ఈ ఎన్నికలు చెప్పబడుతున్నాయి.
PM Modi: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.