డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇటీవల ఆయన నామినేషన్ వేశారు. ఇంతలోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో పోలింగ్ జరుగుతోంది. అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మే 7న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19లోపు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. ఇంతలోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Vadakkan: తెలుగులోకి డబ్ కానున్న మరో మలయాళీ మూవీ
ఆజాద్ స్థానంలో మహ్మద్ సలీమ్ పరాయ్ పేరును పార్టీ ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ 2022లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, ఆ పార్టీతో తన ఐదు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి పలికి.. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. ఈ ఎన్ని్కల్లో ఆయన అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కొద్దీ రోజులుకే ఆయన యూటర్న్ తీసుకుని నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఇది కూడా చదవండి: EPF: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. ఇకపై చికిత్స కోసం ఎంత తీసుకోవచ్చంటే..!
2014లో ఉధంపూర్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. 1980, 1984లో మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి ఆజాద్ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-2006 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 2006-08 మధ్య జమ్ముకశ్మీర్ సీఎంగా కొనసాగారు. 2009-2021 ఫిబ్రవరి వరకు మళ్లీ పెద్దల సభలోనే కొనసాగారు. ఆజాద్ 2022లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, పార్టీతో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ముగించారు.
ఇది కూడా చదవండి: Harish Rao : తెలంగాణ సమాజంలో సానుభూతి ఎక్కువ.. అందుకు కాంగ్రెస్ గెలిచింది