తెలంగాణలో కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఓటేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి మాట్లాడారని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు.
నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది.