Lok Sabha Elections 2024: మూడో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారని ఎన్నికల కమిషన్ వర్గాలు మంగళవారం తెలిపాయి. మృతుల్లో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న 48 ఏళ్ల గోవిందప్ప సిద్దాపూర్‌గా గుర్తించారు. సోమవారం బాగల్‌కోట్ జిల్లా ముధోల్ పట్టణంలో తుదిశ్వాస విడిచారు. మృతుల్లో రెండో వ్యక్తి బీదర్ జిల్లా కుదుంబల్‌కు చెందిన అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆనంద్ తెలంగ్ (32)గా గుర్తించారు.
Read Also: PM Modi: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని సహించబోం.. కర్ణాటక సర్కారుపై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
ఈరోజు 14 స్థానాలకు పోలింగ్
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 14 స్థానాలకు నేడు మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో చికోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావనేజర్, షిమోగా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్ 26న రెండో దశలో 14 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో ఉడిపి-చిక్‌మగళూరు, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయని తెలిసిందే.