UP BJP: గత రెండు పర్యాయాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అత్యధిక ఎంపీ స్థానాలు (80) ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కీలకంగా మారింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం యూపీలో బీజేపీ చతికిలపడింది.
ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు.
'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావించారు.
Amartya Sen: లోక్‌సభ ఎన్నికలపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూదేశం కాదని ఇటీవల లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయని అన్నారు.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌కి చెందిన మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటేశారని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు , ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. గురువారం గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త శిబిరానికి భగవత్ హాజరయ్యారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు సీఎం యోగి, మోహన్ భగవత్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
EVM: ఈసారి ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు పలుమార్లు ఆరోపణలు గుప్పించారు.
BJP: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్‌సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది.