Congress: 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అమెరికా నిఘా సంస్థ CIA, ఇజ్రాయిల్ గూఢచార ఏజెన్సీ మొసాద్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ జర్నలిస్ట్ కేట్కర్ మాట్లాడుతూ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు, ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 206 సీట్లు గెలుచుకుందని అన్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కాంగ్రెస్ 250 సీట్లు గెలుచుకుని అధికారం…
SIR: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీహార్‌లో ఇప్పటికే ఇది వివాదాస్పదం అయింది. నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్‌కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
Rahul Gandhi Bihar Yatra: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు బీహార్‌లో ‘ఓటర్ అధికార యాత్ర’ను ప్రారంభించారు. బీహార్‌లోని ససారాం ప్రారంభమైన యాత్రలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర దాదాపు 16 రోజుల పాటు రాష్ట్రంలోని 25 జిల్లాలు కవర్ చేస్తూ కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని…
Komatireddy Venkat Reddy : బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారన్నారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడని, నా ఛాలెంజ్ కు స్పందించి కేసీఆర్ బయటికి రావడం నాకు సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తడాఖా తెలిసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని, నాలాంటి వాళ్లు పదవి త్యాగం చేయడం…
భారతలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే మెటా రియాక్ట్ అవుతూ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది. అనుకోకుండా జరిగిన పొరపాటును మీరు క్షమించాలని పేర్కొన్నారు.
Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి యూపీలోని బరేలీ జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. జనవరి 7వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాలని పేర్కొనింది.
CM Revanth Reddy : దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధమ ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే… రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం @ 2.0…
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఖేద్కర్ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దిలీప్ ఖేద్కర్ షెవ్‌గావ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.