Lok Sabha Elections: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. వారంలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్క భారతదేశమే కాకుండా అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి.
Lok Sabha Election 2024 : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి వార్తలను పుకార్లే అని ఆమె వ్యాఖ్యానించారు.
BJP: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ రోజు 39 మందితో తొలిజాబితాను సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి కేరళ లోని వయనాడ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీ గురించి కాంగ్రెస్ రహస్యంగా వ్యవహరిస్తోంది. సోనియా గాంధీ ఈ సారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే చెప్పారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు.
Congress 1st list: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికే 195 ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 10 రాష్ట్రాల్లోని కొన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసిటట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోక్‌సభ జాబితా 39 మంది అభ్యర్థులతో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తొలి జాబితాలోనే రాహుల్ గాంధీ, భూపేష్ బఘేల్,…
Tamil Nadu: తమిళనాడులో అధికార డీఎంకేతో మిత్రపక్షాల సీట్ల ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మిత్రపక్షాలైన వీసీకే, ఎండీఎంకేలతో సీట్ల సర్దుబాటు పూర్తైంది. రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని మళ్లీ పునారవృతం చేశారు. విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె)కి రెండు సీట్లు కేటాయించగా, ఈ రెండు కూడా రిజర్వ్డ్ సీట్లు. వైకో నాయకత్వంలోని ఎండీఎంకేకు ఒక సీటును కేటాయించారు. దీంతో పాటు 2019లో ఈ పార్టీకి ఒక రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు.
Congress: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందు కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ 5 హామీలను ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్ భన్వారాలో ప్రకటించారు. ఇదే కాకుండా పేపర్ లీక్స్‌పై చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చకచక పనులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అధికారులు పర్యటనలు నిర్వహించారు. ఈ నెల మధ్యలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ తొలి విడతగా 195 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం…
Actress Raadhika Likely to Contest from Virudhunagar: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తులతో ముందుకు దూసుకెళుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో బీజీపీ కూటమిలో ఇండియా జననాయగ, పుదియ నీది, టీఎంసీ, జాన్‌పాండియన్ తదితర పార్టీలు చేరాయి. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి కూడా చేరింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. Also Read: Ashwin-Kuldeep: నువ్వు, నేను…
Congress: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేయడానికి సమావేశం కాబోతోంది. చత్తీస్‌గఢ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈ రాష్ట్రాల్లో 60 సీట్లపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్-మేలో ఎన్నికలు పూర్తి అవనున్నాయి. ఇప్పటికే బీజేపీ 192 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ విషయం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ ఇస్తోంది. కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంకాగాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి…