BJP: బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. జయంత్ సిన్హా మాజీ కేంద్రమంత్రి పనిచేశారు, హజారీబాగ్‌కి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాను భారత్, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఎంసీని అవినీతి పార్టీగా ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ నిర్దేశించారు.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎతో కలిసి ఉంటానని, ఎక్కడికి వెళ్లనని నితీస్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ప్రధాని మోడీ చిరునవ్వు చిందించారు. బీహార్ ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగం సభలో నితీష్ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఇంతకముందు బీహార్ వచ్చారు, కానీ నేను మీతో లేను, ఇప్పుడు నేను మీతో ఉన్నారు, నేను ఇక ఎక్కడి…
Breaking News: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.
Gautam Gambhir : మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ టిక్కెట్ రేసుకు దూరంగా ఉన్నారు.
Election Commission: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్‌గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Shivraj Singh Chouhan: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే 100 మందితో తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ కొలిక్కి రాకపోవడంతో, వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పక్కాగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని బీజేపీ లోక్‌సభ బరిలో నిలుపనున్నట్లు తెలుస్తోంది.
BJP Lok Sabha Candidates: గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం లోక్‌సభ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో దక్షినాదిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసం నిన్న అమిత్ షా, జేపీ నడ్డా రాజ్‌నాథ్ సింగ్,…
BJP Candidate List for Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము…
Telagnana BJP: రాష్ట్రీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ నేతలు గురువారం న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది.