NDA: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కి చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరిలోనూ ఇదే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 15 ఏళ్ల తర్వాత బీజేడీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసిపోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారికంగా పొత్తుపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు పార్టీల నేతలు మాత్రం పొత్తుపై సంకేతాలు ఇస్తున్నారు.…
Lok Sabha Election : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం (మార్చి 2) లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేయడం ప్రారంభించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి దేశ ప్రజల్లో తిరుగులేని ఆమోదం ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. Ipsos IndiaBus పీఎం అప్రూవల్ రేటింగ్ సర్వేలో పీఎం మోడీకి దేశవ్యాప్తంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే ఫిబ్రవరి 2024లో జరిగింది. గతేడాది సెప్టెంబర్ నెల సర్వేతో పోలిస్తే ఆమోదం 65 శాతం నుంచి 10 శాతం పెరిగి 75 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. కొన్ని నగరాల్లో మోడీ పనితీరుకు ఎక్కువ రేటింగ్…
Harsh Vardhan: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత డాక్టర్ హర్ష వర్ధన్ తన మూడు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. నిన్న బీజేపీ విడుదల చేసిన 195 ఎంపీ అభ్యర్థుల జాబితాలో హర్ష్ వర్ధన్ పేరు లేదు. ప్రస్తుతం ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన స్థానాన్ని ప్రవీణ్ ఖండేల్ వాల్‌కి కేటాయించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 69 ఏళ్ల హర్ష్ వర్ధన్ నేనెప్పుడూ…
PM Modi: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోడీ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు. సెమికండక్టర్ ప్రాజెక్టులతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, హర్యానాలో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించనున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. భారత్‌లో నిరుద్యోగం పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగా ఉందని, భూటాన్ కన్నా వెనకబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 40 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకుందని, పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లో రెండింతల…
Pawan Singh: బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు తొలి జాబితా కొన్ని వివాదాలకు కారణమవుతోంది. విద్వేష వ్యాఖ్యలు చేసే పలువురు నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్యంగా టార్గెట్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆ పార్టీకి దెబ్బపడింది. భోజ్‌పురి యాక్టర్, సింగర్ పవన్ సింగ్‌ని బెంగాల్ అసన్‌సోల్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థికిగా నిన్న బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది సమయానికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు పవన్ సింగ్ టార్గెట్‌గా…
BJP : భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ పొందిన అభ్యర్థుల్లో హైదరాబాద్, తెలంగాణకు చెందిన మాధవి లత కూడా ఉన్నారు.
BJP: బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో వెళ్తోంది. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, రాజీవ్ చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింథియా, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి ప్రముఖ నేతలు తొలి లిస్టులోనే ఉన్నారు.
BJP 1st List: లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు 34 మంది మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా లోక్‌సభ బరిలో నిలిచారు. తొలి జాబితాలో 28మంది మహిళలతో పాటు 50 ఏళ్ల లోపు 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన 57 మందికి చోటు దక్కింది. మొత్తం 195…