Trinamool Congress: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు. ఈ రోజు కోల్‌కతాలో జరిగిన టీఎంసీ మెగా బ్రిగేడ్ ర్యాలీలో ఆమె లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు.
PM Modi: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ అజాంగఢ్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని రూ. 34 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించారు. భారతదేశ ప్రగతిపై అసంతృప్తితో, ఎన్నికల ముందు అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్నికల ఎర అని కొందరు అంటున్నారు.. గత నాయకులు ఎన్నికల ముందు పథకాలు, ప్రాజెక్టులను ప్రకటిస్తారు కానీ పూర్తి చేసేవారు కాదని ప్రధాని అన్నారు. గతంలో తాను పునాది వేసిన ప్రాజెక్టులను ప్రారంభించడం…
Brijendra Singh: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీకి షాక్ తగిలింది. హర్యానాలో హిసార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజేంద్ర సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను రాజీనమా చేసిన విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ నేను బలవంతపు రాజకీయ కారణాల వల్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. హిసార్ ఎంపీగా తనకు అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు శ్రీ.…
Congress: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు సభ్యులు ఉండే ఎలక్షన్ ప్యానెల్‌లో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా.. తాజాగా గోయెల్ కూడా రాజీనామా చేయడంతో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతంతా ఆయన మీదే ఉంది. అయితే, సీఈసీ రాజీవ్ కుమార్‌తో విభేదాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీ పేరును జపించే భర్తలకు రాత్రి భోజనం పెట్టొద్దని మహిళలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. కుటుంబ సభ్యులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రూ.1000 పథకం నిజమైన సాధికరత అని కేజ్రీవాల్ మహిళలతో అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పేరు జపిస్తే రాత్రి భోజనం వడ్డించొద్దని ముఖ్యమంత్రి శనివారం సూచించారు.
Arun Goel: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామానాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం భారమంతా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై పడింది. లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అరుణ్ గోయెల్ లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
Congress: తమిళనాడు, పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. సీట్ల షేరింగ్ ప్రకారం మరోసారి డీఎంకే 2019 ఫార్ములాను రిపీట్ చేసింది. మరోసారి కాంగ్రెస్‌కి తమిళనాడులో 9 ఎంపీ స్థానాలను కేటాయించింది. ఇక పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 2019 ఎన్నికల్లో 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ ఆ సమయంలో 9 స్థానాలకు గానూ…
BJP: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తాజాగా వెల్లడించింది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లకు చేరువకు వస్తుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ఎన్డీయేకి 358-398 మధ్య సీట్లు వస్తాయని, ఇందులో బీజేపీకి స్వతహాగా 333-363 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పింది.
Amit Shah: కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేశారని, పేదల కోసం ఏం చేసింది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆరోపించారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన ఓబీసీ మోర్చా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పేదలకు మేలు చేసింద కేవలం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ మాత్రమే అని అన్నారు.
Nabam Tuki: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తు్న్నారు. అరుణాచల్ ప్రదేవ్ మాజీ సీఎం నబమ్ తుకీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను అడ్డుకోలేని నైతిక కారణాలతో టుకీ రాజీనామా చేశారు.