Congress: ఆదాయ పన్ను శాఖ తమపై ప్రారంభించిన రీ-అసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ఈ రిట్ పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లు తెలిపారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధిస్తారని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు.
Annamalai: బీజేపీ దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం మాజీ ఐపీఎస్ అధికారి, తమిళ సింగంగా పేరు తెచ్చుకున్న కె. అన్నామలై. 37 ఏళ్ల ఈ యంగ్ పొలిటిషియన్‌ని బీజేపీ తమ భవిష్యత్తుగా భావిస్తోంది. అందుకనే అతి తక్కువ వయసులో తమిళనాడు వంటి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ పార్టీ అన్నామలైని చాలా స్పెషల్‌గా భావిస్తోంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 9 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. కేవలం తమిళనాడుకు చెందిన అభ్యర్థులనే బీజేపీ వెల్లడించింది.
Sadananda Gowda: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూర్ నార్త్ సీటు నుంచి వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన కలత చెందానని, దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సదానంద గౌడ గురువారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజేని బీజేపీ బరిలోకి దింపింది. ప్రస్తుతం…
Shobha Karandlaje: బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మార్చి 1న బెంగళూర్‌లో జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడును ఉద్దేశిస్తూ.. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి బాంబు పెట్టాడని వ్యాఖ్యలు చేశారు. తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోల్ ప్యానెల్ ఆదేశించింది.
'Shakti' remarks: ఇటీవల ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి నేతలు హాజరైన ఈ మెగా ఈవెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు బుధవారం బీజేపీ ఫిర్యాదు చేసింది.
CM Siddaramaiah: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్‌లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్…