హోలీ సెలబ్రేషన్స్ కు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో కూడిన వాటర్ గన్‌లు దర్శనమిచ్చాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే, ఈ వాటర్ గన్‌ల వినియోగంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది
పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి రేఖ పాత్రకు బీజేపీ టికెట్ ఇచ్చింది. చాలా రోజులుగా చర్చలో ఉన్న సందేశఖలీ ఈ నియోజకవర్గంకిందకే వస్తుంది.
బీజేపీ అధిష్ఠానం లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు కీలక స్థానాలకు అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ నుంచి బీజేపీ కీలక నేతను అభ్యర్థిగా ప్రకటించింది.
Varun Gandhi: వరుణ్ గాంధీకి బీజేపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నేపథ్యంలో.. తాజాగా ప్రకటించిన 5వ జాబితా అభ్యర్థుల్లో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ నుంచి ఎంపీగా ఉన్న వరణ్ గాంధీ స్థానాన్ని కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాదకు కేటాయించింది.
లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఏపీ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.
BJP 5th List: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వారితో బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ కంగనా రనౌత్ బీజేపీ తరుపున పోటీలో దిగనుంది. ఇటీవల బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిన్ గంగోపాధ్యాయ కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు.
Naveen Jindal: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి వరస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్‌కి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హస్తాన్ని వీడారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం బీజేపీలో చేరారు. ఆయన గతంలో హర్యానా కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.
Gali Janardhan Reddy: మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి సొంతూగూటికి తిరిగి వస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్న ఆయన కర్ణాటక రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీపీ) పేరుతో కొత్త పార్టీ స్థాపించి, గతేడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.
Bengal BJP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా 2026 లోపే మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బెంగాల్ బీజేపీకి సైద్ధాంతిక అంశమని అన్నారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను స్వీప్ చేయడానికి ఈ చట్టం సహాయపడుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి, అరాచక టీఎంసీని ఓడించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మజుందార్ అన్నారు.