Congress: ఆదాయ పన్ను శాఖ తమపై ప్రారంభించిన రీ-అసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ఈ రిట్ పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లు తెలిపారు. 2014-15, 2015-16 మరియు 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మార్చి 20న తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనల్ని వినిపించారు.
Read Also: Kodandaram: కేజ్రీవాల్ను రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేసారు..
ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని, రికవరీ చేయబడిని మెటీరియల్ ప్రకారం పార్టీ ద్వారా ఎస్కేప్ అయిన ఆదాయం రూ. 520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు.