‘Shakti’ remarks: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Shakti’ remarks: ఇటీవల ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి నేతలు హాజరైన ఈ మెగా ఈవెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు బుధవారం బీజేపీ ఫిర్యాదు చేసింది.
Read Also: Bihar: బీహార్ కాంగ్రెస్‌లో జోష్.. హస్తం గూటికి పప్పు యాదవ్
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ఫిబ్రవరి 17న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘హిందూ మతంలో శక్తి అనే పదం ఉంది. మేము ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము’’ అని వ్యాఖ్యలు చేశారు. ‘‘శక్తి ఏంటంటే.. ఈవీఎంలో రాజుగారి ఆత్మ ఉంది. రాజు ఆత్మ ఈవీఎంలతో పాటు దేశంలోని ప్రతీ సంస్థలో ఈడీ, సీబీఐ, ఐటీలో ఉంది’’ ఈవీఎంలు లేకుండా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలవలేరని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
కాంగ్రెస్, ఇండియా కూటమికి హిందువులు, హిందూ ధర్మం అన్నా లెక్కలేదని, వారు హిందువులను అవమానించేందు ఎలాంటి అవకాశాన్ని కూడా వదలడం లేదని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. నిన్న తమిళనాడులో పర్యటించిన ఆయన డీఎంకే, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి తమిళనాడులో శక్తి స్వరూపాలని, శక్తిని ధ్వంసం చేస్తామని కాంగ్రెస్, డీఎంకే కూటమి అంటున్నాయని, హిందూ మతంలో శక్తి అంటే మాతాశక్తి, నారీ శక్తి అని ప్రధాని అన్నారు. ఇండి కూటమి మహిళల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తున్నారని ఆయన అన్నారు. మహిళల పట్ల ఇండియా కూటమి వ్యవహరించే శైలికి మీ అందరూ సాక్ష్యమని, రాష్ట్ర మాజీ సీఎం జయలలిత జీవించి ఉన్నప్పుడు డీఎంకే నాయకులు ఆమెతో ఎలా ప్రవర్తించారో అందరీ తెలుసని, ఇది డీఎంకే అసలు రూపమని ఆయన అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి రెండు వైపులని ప్రధాని ఆరోపించారు.
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!