RKS Bhadauria: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీకిలో చేరుతున్నారు. తాజాగా భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఆదివారం బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ప్రధాని కార్యదర్శి వినోద్ తావ్దే సమక్షంలో పార్టీలో చేశారు.
Onion exports: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిరవధికంగా నిషేధాన్ని పొడగించింది. ఈ పరిణామం పలు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరల్ని ప్రేరేపించనుంది.
Lok Sabha Elections 2024 : మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని పార్లమెంటరీ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్. కానీ ఇక్కడ డ్యూటీకి ఎగవేసేందుకు అధికారులు రోజూ దరఖాస్తులు పెడుతున్నారు.
Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల ఐదవ జాబితా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) అభ్యర్థుల పేర్లను విడుదల చేసే జాబితా మధ్యాహ్నం వచ్చే వీలుంది.
అధిక ఇంధన ధరలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రెండేళ్ల సూచన వ్యవధిలో ఇంధన ధరలు తగ్గిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పూరీ మాట్లాడారు.
బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం వివిధ మతాలకు చెందిన వ్యక్తుల మధ్య భూమిని విక్రయించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) మంజూరును తాత్కాలికంగా నిలిపివేసింది
సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ నటి, మోడల్ నేహాశర్మ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం మహాకూటమిలో సీట్లపై పోరు కొనసాగుతున్న తరుణంలో బీహార్‌లోని భాగల్‌పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ తన వాదన వినిపించారు.
Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికలకు ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించాయి. సీట్ల పంపకం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ వ్యూహాత్మకంగానే జరుగుతున్నాయి.
Himachal Pradesh : ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జరిగిన క్రాస్ ఓటింగ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ తుఫాను ఇప్పట్లో ఆగి పోయే సూచనలు కనిపించడం లేదు.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాలూకు మొత్తం ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మిసా భారతి, రోహిణి ఆచార్యలను ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకుంటున్నారు.