లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 9 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. కేవలం తమిళనాడుకు చెందిన అభ్యర్థులనే బీజేపీ వెల్లడించింది. చెన్నై సౌత్-తమిళిసై, కోయంబత్తూరు-అన్నామలై, కన్యాకుమారి-రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి ఫేజ్‌లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారమే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో మూడో జాబితాలో కేవలంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పేర్లు మాత్రమే ఉన్నాయి. తొలి విడతలో 195 మందిని వెల్లడించింది. అందులో ప్రధాని మోడీ పేరు ప్రకటించారు. మూడోసారి వారణాసి నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. అనంతరం సెకండ్ లిస్టులో 72 మంది పేర్లను ప్రకటించింది. ఈ రెండు జాబితాలో తమ పేర్లు లేవని కీలక నేతలు అలకబూనారు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సదానందగౌడ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
తమిళిసై ఇటీవలే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమె పదవికి రాజీనామా చేయడం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడం జరిగింది. ఇక బుధవారమే ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కమలం గూటికి చేరారు. కొన్ని గంటల వ్యవధిలోనే తమిళిసై లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించేశారు. గతంలో పలుమార్లు ఆమె పరాజయం పాలయ్యారు. మరోసారి బరిలోకి దిగుతున్నారు. మరీ ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ గత కొద్ది రోజులుగా దక్షణాది రాష్ట్రాలపైనే దృష్టి పెట్టారు. సౌతిండియాలో ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రయత్ని్స్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది. తొలి విడతగా ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.